గత అక్టోబరులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రష్యాలో సమావేశమైన విషయం తెలిసిందే. ఇరునేతల మధ్య విజయవంతంగా సాగిన ఈ సమావేశం.. రెండు దేశాల మధ్య సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని సూచిస్తోందని సీపీసీ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ లియూ జియాన్చావో వ్యాఖ్యానించారు. భారత్తో స్నేహపూర్వక సంబంధాల బలోపేతానికి, రెండు దేశాల కుదిరిన ఏకాభిప్రాయాన్ని సంయుక్తంగా అమలు చేయడానికి చైనా సిద్ధంగా ఉందన్నారు.