TG: మోహన్‌బాబు నివాసం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. గేట్లు తోసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్.. చిరిగిన చొక్కాతో, గాయాలతో బయటకు వచ్చాడు. అతడి వెంట వచ్చిన ప్రైవేట్ బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించివేశారు. అయితే, తన కూతురిని చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారని మనోజ్ వాపోయాడు. మోహన్‌బాబు బౌన్సర్లు కొడుతున్నారని తెలిపాడు. కాగా, మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడికి యత్నించిన విషయం తెలిసిందే.