న్యాయవ్యవస్థలో ఆడంబరాలకు తావు లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు సోషల్ మీడియా వాడకానికి దూరంగా ఉండాలని, తీర్పులపై ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదని వెల్లడించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇద్దరు మహిళా జ్యుడీషియల్ అధికారుల తొలగింపునకు సంబంధించిన వ్యాజ్యాన్ని విచారిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం ఈ మౌఖిక వ్యాఖ్యలు చేసింది.