ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి సహా అసోం రాష్ట్రాలకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈ కమిటీలే ఎంపిక చేయనున్నాయి. ఎన్నికల సమరానికి కాంగ్రెస్ ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేసింది.