AP: ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం మరోమారు రుజువైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మోదీ నాయకత్వంలోనే దేశ సమగ్రాభివృద్ధి, సుస్థిరపాలన సాధ్యమని వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయంతో రుజువైందన్నారు. ఈ సందర్భంగా మోదీకి అభినందనలు తెలిపారు. నితీష్ కుమార్ పట్ల బీహార్ వాసులకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని వెల్లడించారు.