తనని చెప్పుతో కొట్టినా కొట్టించుకుంటానని…. బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. రైతు ద్రోహి కేసీఆర్ అని, యూరియా సబ్సిడీ ఇస్తుంది కేంద్రమేననే వివరాలు చెప్పమని ఆయన అన్నారు. రేపు నిరసనలు ఎందుకు చేస్తున్నారు కుటుంబము మీద ఆరోపణలు వస్తున్నాయని డైవర్ట్ చేసేందుకేనా? అని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడుతుందని, కేసీఆర్ కుటుంబం మోదీ ని బీజేపీ తిట్టడం పనిగా పెట్టుకున్నారని అన్నారు.
దేశంలో ఓ ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని చర్చ జరుగుతోందని, టిఆర్యస్ దివాళా దీసి బిఆర్యస్ వచ్చిందని అన్నారు. బందిపోట్ల పార్టీ బి ఆర్ యస్ వచ్చింది, రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది అద్భుతాలు ఏమి చేశావు? అని ఆయన ప్రశ్నించారు. బిడ్డ లిక్కర్ కేసు మీద ఇంతవరకు కేసీఆర్ మాట్లాడలేదు, మళ్ళా కెసిఆర్ కుటుంబం గెలిస్తే తెలంగాణ ప్రజలు అంతా చిప్పలు కడగాలని అన్న ఆయన చెప్పుతో కొడితే కొట్టించుకుంటా, కానీ తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చండని అన్నారు.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇటీవల చేసిన కామెంట్స్ పై ఆయన తాజాగా మండిపడ్డారు.వైద్యశాఖను చూసుకునే అధికారికి కనీస తెలివి లేదని, గడల శ్రీనివాస్ రావు పెద్ద అవినీతి పరుడని ఆయన విమర్శించారు. ప్రజలను ఓ మతానికి చెందిన దేవుడు కాపాడట, మరి ఆ దేవుడు ఉన్న దేశానికే పో ఎందుకు ఇక్కడ బతకడం, ఓ మతానికి కొమ్ముకాసే అధికారివా? ఒక్క హాస్పిటల్ లో సరైన సౌకర్యాలు కల్పించలేకపోయవు అంటూ ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు.