బీహార్ ఎన్నికల్లో మహాగఠ్బంధన్ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కూటమి తరఫున సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. కౌంటింగ్లో 10 రౌండ్లు పూర్తయ్యేసరికి తేజస్వీ యాదవ్ 3230 ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ ఆధిక్యంలో ఉన్నారు.