జర్మనీలో సంకీర్ణ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఛాన్స్లర్ ఒలాఫ్ ప్రభుత్వానికి మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. దీంతో యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశంలో రాజకీయ అలజడి నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందట. జనవరి 15లోగా విశ్వాస పరీక్షకు వెళ్తానని ఒలాఫ్ తెలిపారు. మరోవైపు US అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడంతో వ్యాపార, భద్రతా సంబంధాలపై ప్రభావం ఉంటుందని బెర్లిన్ పేర్కొంది.