బీహార్లో NDA విజయంపై ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో PM మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీహార్ ప్రజలు NDAకు అద్భుత విజయం అందించారంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం సుపరిపాలన, అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఆనందంతో రాష్ట్రంలో ప్రతి ఇంట మఖానా పాయసం వండుకుని సంతోషిస్తారని అన్నారు. బీహార్ సంస్కృతిని ప్రస్తావిస్తూ విజయాన్ని ఆయన ఓ పండుగలా అభివర్ణించారు.