»Ayodhya Priest Invites Rahul Gandhi To Stay In Hanumangarhi Temple
Rahul Gandhi : మా గుడిలో ఉండండి: రాహుల్ కి అయోధ్య పూజారి ఆహ్వానం..!
Rahul Gandhi : తన లోక్ సభ సభ్యత్వ రద్దుతో ఢిల్లీ తుగ్లక్ రోడ్డు లోని ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని కేంద్రం రాహుల్ గాంధీకి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయనకు పలువురి నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. ఆయన కోరుకుంటే తన నివాసంలో ఉండవచ్చునని పార్టీ చీఫ్ మలిఖార్జున్ ఖర్గే ఇదివరకే ఆయనను ఆహ్వానించారు.
తన లోక్ సభ సభ్యత్వ రద్దుతో ఢిల్లీ తుగ్లక్ రోడ్డు లోని ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని కేంద్రం రాహుల్ గాంధీకి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయనకు పలువురి నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. ఆయన కోరుకుంటే తన నివాసంలో ఉండవచ్చునని పార్టీ చీఫ్ మలిఖార్జున్ ఖర్గే ఇదివరకే ఆయనను ఆహ్వానించారు. అయితే అనూహ్యంగా అయోధ్య లోని హనుమాన్ గర్హి మందిర్ కి చెందిన మహంత్ ఒకరు కూడా రాహుల్ ని ఆహ్వానించారు.
ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేసిన అనంతరం ఆయన ఇక్కడి దేవాలయాల సముదాయంలో ఒక చోట ఉండవచ్చునని, ఈ పవిత్రమైన నగరానికి రావలసిందిగా తాము కోరుతున్నామని అన్నారు. బీజేపీకి పట్టున్న అయోధ్యలో ఓ కాంగ్రెస్ నేతకు అందిన ఆహ్వానం ఆయనకు మద్దతునివ్వడమేనని భావిస్తున్నారు.
సంకట్ మోచన్ సేన జాతీయ అధ్యక్షుడైన మహంత్ సంజయ్ దాస్.. ఇదే విషయమై ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. రాహుల్ ఇక్కడికి వచ్చి హనుమాన్ గర్హి మందిరంలో ప్రార్థనలు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోవచ్చునన్నారు. ఈ క్యాంపస్ లో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయని, అందువల్ల ఆయన ఇక్కడికి వస్తే తాము ఎంతో సంతోషిస్తామని సంజయ్ దాస్ చెప్పారు.