TG: ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే, జనవరి 2, 3 తేదీల్లో IAS అరవింద్, hmda మాజీ సీఈ BLN రెడ్డి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ACB ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ PMLA కింద విచారణ జరపనుంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం.