సత్యసాయి: రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించినట్లు మంత్రి తెలిపారు.