W.G: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన 16వ జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఉన్న 47 పరిశ్రమలకు స్టాటిటరీ నోటీసులు ఇచ్చి, వాటికి సంబంధించిన రిపోర్టులను అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.