KDP: జిల్లాలోని కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కడప గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల ప్రాంగణంలో ఎంపికలు ఉంటాయని చెప్పారు. క్రీడాకారులు తమ వెంట పదో తరగతి మార్క్స్ లిస్టు, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.