ప్రధాని మోదీ మూడు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఇవాళ జామ్‌నగర్‌లోని జంతు సంరక్షణ కేంద్రం వంతారాను సందర్శించనున్నారు. జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో పాల్గొననున్నారు. రాబోయే 2 రోజుల్లో సోమనాథ్ ఆలయ సందర్శన సహా పలు కార్యక్రమాలకు ప్రధాని హాజరుకానున్నారు. వంతారా అనేది దాదాపు 3వేల ఎకరాల్లో రిలయన్స్ ఫౌండేషన్ స్థాపించిన అత్యాధునిక జంతు సంరక్షణ&పునరావాస కేంద్రం.