TG: BRS అధినేత, మాజీ CM KCR సంచలన వ్యాఖ్యలు చేశారు. APలో కూటమి లేకుంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చేవారు కాదన్నారు. సిరిసంపదలు ఉన్న తెలంగాణను కొందరు దోచుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పదేళ్లు రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది BRS మాత్రమేనని, మరోసారి సింగిల్గానే అధికారంలోకి వస్తామన్నారు.