TG: రెవెన్యూశాఖలో సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వచ్చే మార్చినాటికి భూభారతి యాప్లో సర్వేకు సంబంధించిన అంశాలను పటిష్ట పరిచి పునరుద్ధరిస్తామని తెలిపారు. 7,500 మంది వరకు లైసెన్స్డ్, ప్రభుత్వ సర్వేయర్లను కూడా నియమిస్తామని ప్రకటించారు. త్వరలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.