TG: వన్యప్రాణుల బోర్డుకు కొత్త సభ్యులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ బోర్డుకు సీఎం రేవంత్ రెడ్డి ఛైర్మన్గా, వైస్ ఛైర్మన్గా అటవీశాఖ మంత్రి కొండా సురేఖ వ్యవహరించనున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు, పర్యావరణ వేత్తలతో కలిపి మొత్తంగా 29మందితో బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, వంశీకృష్ణ, మురళీ నాయక్ భూక్యా, పాయం వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.