TG: ఢిల్లీ పేలుళ్లపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. చేతిలో ఫోన్ ఉంది కదా? అని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని.. బాంబు పేలుళ్లతో BJPకి ఏం సంబంధం అని మండిపడ్డారు. ఇలాంటి పోస్టులు పెట్టడం దేశద్రోహం కిందికే వస్తుందన్నారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని, ఇప్పుడు ఆ నెపాన్ని తమపై రుద్దుతున్నారని ఆరోపించారు.