TG: రాష్ట్ర విద్యా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మెరుగైన విద్య అందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో కమిషన్ సభ్యులు పర్యటన చేపట్టారు. డిసెంబరు 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో పర్యటించి.. అక్కడి పరిస్థితులను కమిషన్ సభ్యులు పరిశీలించనున్నారు.