దేశంలో ప్రస్తుతం 65 లక్షల మంది గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లు ఉన్నట్లు నీతి అయోగ్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వారికి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించేందుకు కేంద్రం ప్రత్యేక పథకాన్ని తీసుకురానుంది. వారికి పెన్షన్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఈ పథకం రూపొందిస్తున్నట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.