అమెరికాలో 1 బిలియన్ డాలర్లు(రూ.8489 కోట్లు) పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి వెంటనే అనుమతులు మంజూరు చేస్తానని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. పర్యావరణ అనుమతులు సైతం వెంటనే ఇచ్చేస్తానని ప్రకటించారు. దీనిపై ప్రపంచ కుబేరుడు, డోజ్ శాఖ బాధ్యతలు చూస్తున్న ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఈ ప్రతిపాదన అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.