TG: లక్షలాది మంది ఉద్యమబాట పట్టి తెలంగాణను సాధించారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. గత పదేళ్ల పాటు నియామకాలు చేపట్టలేదు. ఏడాదిలో 50 వేలకు పైగా నియామకాలతో చరిత్ర సృష్టించాం. DSCతో 55 రోజుల్లో 11 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు చేపట్టారు. పరీక్షలు ఎందుకు వాయిదా వేయలేదంటూ నన్ను తిట్టారు. వాయిదా పడితే నిరుద్యోగుల ఆత్మహత్యకు దారితీస్తుంది’ అని వ్యాఖ్యానించారు.