AP: రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మకంగా సంస్థ రానుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. గూగుల్ పెట్టుబడులను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి లోకేశ్ కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.