మూడు పూటలు అన్నం తింటే పలు సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు వెల్లడించారు. వైట్ రైస్ ఎక్కువ తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. తద్వారా బరువు పెరుగుతారు. ఇలా తింటే ఊబకాయం బారిన పడటంతో పాటు, గుండెకు కూడా ప్రమాదమే. అందువల్ల అన్నం తగ్గించి దానికి బదులుగా చపాతీలు తినడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. వైట్ రైస్‌కు బదులు బ్రౌన్ లేదా రెడ్ రైస్ తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని అంటున్నారు.