TG: అల్లు అర్జున్ను నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. కోర్టు హాల్లో జనం ఎక్కువగా ఉండటంతో అనంతరం జడ్జి ఛాంబర్‌కు తరలించారు. హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చాకే నాంపల్లి కోర్టులో రిమాండ్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 4 గంటలకు హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది.