బీహార్ ఎన్నికల్లో NDA విజయంపై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. ఫలితాలు నిరాశపరిచాయని, కాంగ్రెస్ తన ఓటమికి గల కారణాలను ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. విపక్ష కూటమిలో తాము సీనియర్ భాగస్వామి కాదని, RJDకి కూడా స్వీయ పరిశీలన ముఖ్యమని అన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో అధ్యయనం చేయాలన్నారు. ఎన్నికల ప్రచారానికి తనను ఆహ్వానించలేదని, తాను ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు.