వందరోజుల్లో హామీలు అమలు చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలను నమ్మించి మోసం చేశారని మాజీ మంత్రి సబితారెడ్డి విమర్శించారు. కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు ఇస్తానన్న లక్ష రూపాయలతో పాటు తులం బంగారం వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని మండిపడ్డారు.