TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య ఇంటికి వెళ్లి ఆయన కుటంబసభ్యులను పరామర్శించారు. అబ్బయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన చిత్రపటానికి పూలమల వేసి నివాళులు అర్పించారు. కాగా.. మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.