TG: చనిపోయిన రాజీవ్ గాంధీపై బీజేపీ ఇప్పుడు రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ రిజర్వేషన్‌కు వ్యతిరేకమని పీఎం మోదీ అంటున్నారు. చనిపోయిన రాజీవ్ ఇప్పుడు వస్తడా అని ప్రశ్నించారు. మోదీ ఓబీసీ నాయకుడిగా రిజర్వేషన్లకు అనుకూలమా లేక వ్యతిరేకమా అని ప్రశ్నించారు. బీజేపీ కులగణనకు అనుకులామా కాదా అన్న విషయానికి ఈటల, కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలని వెల్లడించారు.