దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ ప్రపంచ టాప్ స్మార్ట్ వాచ్ బ్రాండ్ టైటిల్‌ను కోల్పోయింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(IDC) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. 2024 మొదటి మూడు త్రైమాసికాలలో హువావే 23.6 మిలియన్ స్మార్ట్‌వాచ్‌లు, రిస్ట్బ్యాండ్లను షిప్పింగ్ చేసి యాపిల్‌ను అధిగమించి మొదటి స్థానంలోకి ఎగబాకింది. కాగా, 2వ స్థానంలో యాపిల్.. 3, 4 స్థానాల్లో షియామి, శామ్‌సంగ్‌లు నిలిచాయి.