మహారాష్ట్రలోని కొల్హాపుర్‌కు చెందిన షెఫ్ దిగ్విజయ్ భోస్లే.. ఒకే పదార్థంతో ఏకంగా 521 వంటకాలు చేశారు. దీనికోసం భారత్‌తోపాటు పలు దేశాల నుంచి సేకరించిన ఏడు రకాల బియ్యాన్ని ఉపయోగించారు. సంప్రదాయ భారతీయ వంటకాలైన దాల్ ఖిచిడీ, బిర్యానీ, పులావ్తోపాటు, అంతర్జాతీయ వంటకాలైన రిసోట్టో, పాయెల్లా, సుషీ వంటి పలు వంటకాలను ఒకే వేదికపై సిద్ధం చేశారు.