పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు నిరసనగా గతేడాది మే 9న దేశవ్యాప్తంగా PTI కార్యకర్తలు హింసకు దిగారు. రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయంతోపాటు ఫైసలాబాద్‌లోని ISI భవనం సహా అనేక సైనిక స్థావరాలపై దాడులు చేశారు. ఈ ఘటనల్లో దోషులుగా తేలిన 25 మందికి ఇటీవల సైనిక న్యాయస్థానాలు జైలుశిక్ష విధించగా తాజాగా మరో 60 మందికి జైలు శిక్షలు విధించాయి.