AP: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఎనిమిది కీలక ఫైళ్లు గల్లంతయ్యాయి. ఫైళ్ల గల్లంతుపై ఉద్యోగులను ఈవో వివరణ అడిగి తెలుసుకున్నారు. అలాగే, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అడిగిన ప్రశ్నలకు సిబ్బంది జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఫైళ్ల వ్యవహారాన్ని సంబంధిత అధికారులకు ఈవో వివరించినట్లు సమాచారం.