AP: మెగా డీఎస్సీ వాగ్దానం నెరవేరిందని మంత్రి లోకేష్ అన్నారు. డీఎస్సీ తుది ఎంపిక జాబిత విడుదల చేసిన అనంతరం ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ‘డీఎస్సీలో అర్హత పొందిన అభ్యుర్థులందరికీ అభినందనలు. ఈ మైలురాయి బాధ్యతను మరింత పెంచింది. ఈసారి జాబితాలో పేరు లేనివారు నిరుత్సాహపడొద్దు. హామీ ఇచ్చినట్టుగా ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు.