గత ఏడు నెలల్లో తాను 7 యుద్ధాలను ఆపానని US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తాను చేసిన ఈ పనిని గతంలో ఎవరూ చేయలేదని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం చాలా కష్టమైనదని, కానీ దాన్ని కూడా ముగించగలనని తాను భావించానని చెప్పారు. దాదాపు ఒకటి 31 ఏళ్లు, మరొకటి 35 ఏళ్లు, ఇంకోటి 37 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాలను తాను కేవలం కొన్ని గంటల్లోనే ముగించానని ట్రంప్ పేర్కొన్నారు.