ప్రకాశం: తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల HM ముత్తోజు సుధాకర్ శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. CM చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సుధాకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల సిబ్బంది హెడ్మాస్టర్ సుధాకర్‌కు అభినందనలు తెలిపారు.