GNTR: తురకపాలెంలో జరుగుతున్న మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గ్రామానికి శుద్ధి చేసిన తాగునీరు అందించలేకపోవడం, పారిశుధ్యం లేకపోవడమే ప్రజలు జ్వరాలతో చనిపోవడానికి కారణమని తెలిపారు.