TG: రేపు ఉదయం 10 గంటల వరకు HYDలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రధానమార్గాలపై ఇతర వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రద్దీ సమయంలో ఆర్టీసీ బస్సులను మెహిదీపట్నం, కూకట్ పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్ వరకే అనుమతిస్తున్నారు. విమానాశ్రయం వెళ్లేవారు PVNR ఎక్స్ ప్రెస్ వే లేదా ORR వాడాలని సూచించారు. ఎవరూ గూగుల్ రూట్ మ్యాప్ వాడొద్దని తెలిపారు.