TG: 48గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి GHMC కమిషనర్ ఆదేశాలు చేశారు. గ్రేటర్లో గణేశ్ నిమజ్జనానికి 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనులు, 24 పోర్టబుల్ ట్యాంకులు, 27 బేబీ పాండ్లు సిద్ధం చేశారు. దీంతోపాటు 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లతో సహా హుస్సేన్ సాగర్లో 9 బోట్లు, 200 మంది గత ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.