TG: కొన్ని మీడియా ఛానెల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా వాటి తీరు మార్చుకోవాలని.. ఈ విధానం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదన్నారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసినా.. చూస్తూ ఊరుకుంటున్నామని.. వేరే రాష్ట్రాల్లోగా ఛానెల్స్‌ను బంద్ పెట్టడం లేదని పేర్కొన్నారు. అంత దూరం తెచ్చుకోవద్దని హెచ్చరించారు.