TG: ఒకే అంశంపై ఒకటి కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఒకే అంశంపై 3 ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేశారని ఏఏజీని జడ్జి ప్రశ్నించారు. పలు సుప్రీంకోర్టు తీర్పులను న్యాయమూర్తి ఉదహరించారు. 3 ఎఫ్ఐఆర్ల వివరాలను పోలీసుల నుంచి తీసుకోవాలని ఏఏజీకి ఆదేశాలు జారీ చేశారు.