దేశంలో రోజు రోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి. అభం, శుభం తెలియని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. తాజాగా… ఓ ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటి దారుణానికి పాల్పడిన నిందితుడికి ఆ గ్రామ పెద్దలు విధించిన శిక్ష ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఐదు గుంజీలు శిక్షగా విధించడం గమనార్హం. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బిహార్ లోని నవాదా ప్రాంతంలోని అరుణ్ పండిట్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఇస్తానని నమ్మించి పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నారు. అయితే గ్రామంలో కొందరు… ఈ విషయాన్ని పంచాయితీలో తేల్చుకోమని సలహా ఇచ్చారు. దాంతో చిన్నారి తల్లిదండ్రులు.. పంచాయతీ పెద్దలను కలిశారు. జరిగిన విషయం చెప్పగా పంచాయితీ పెట్టారు. దానికి గ్రామస్థులందరూ హాజరయ్యారు.
అయితే ఈ కేసులో గ్రామ పెద్దలు ప్రవర్తించిన తీరు.. చెప్పిన తీర్పు.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గ్రామపెద్దలు.. నిందితుడికి గ్రామ ప్రజల ముందు ఐదు గుంజీలను శిక్షగా విధించారు. అంతకిమించి ఇంకేం చెప్పలేదు. దాంతో ఆ నిందితుడు ఐదు గుంజీలు చేసేసి చక్కగా కూర్చుండిపోయాడు. ఈ ఘటనని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా… అది కాస్త వైరల్ గా మారింది. నిందితుడికి వేసిన శిక్ష ని చూసి…. నెటిజన్లు మండిపడుతున్నారు.