TG: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉనికిచెర్ల శివారులో ఇంద్ర సినిమాలోని సీన్ రిపీట్ అయింది. కొందరు కేటుగాళ్లు బ్యాగులో పెట్టిన డబ్బులకు పూజలు చేస్తే మూడింతలు అవుతాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.55.55 లక్షలు కొట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.