JGL: ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అశోక్ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 5మంది అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేస్తూ, ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేట్లు చూడాలన్నారు.