భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కోచ్ బార్టోనీజ్కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. ‘ఎక్కడ ఆరంభించాలో తెలియకుండా రాస్తున్నా. కోచ్.. మీరు నాకు గురువు కన్నా ఎక్కువ. మీరు నేర్పిందంతా ఆటగాడిగా, వ్యక్తిగా నా ఎదగుదలకు ఎంతో ఉపయోగపడింది. నా కోసం మీరెంతో శ్రమించారు. నాకు అండగా నిలిచారు. మీ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు కృతజ్ఞతలు’ అని ‘ఎక్స్’ వేదికగా రాసుకొచ్చాడు.