W.G: పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో శనివారం ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ టి. రాజరాజేశ్వరి మాట్లాడుతూ.. చిన్నప్పుడే రెండు కళ్లు కోల్పోయినా పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో తను విద్యనేర్చుకోవటమే కాకుండా తనలాంటి వారికోసం బ్రెయిలీ లిపిని సృష్టించి చరిత్ర సృష్టించారు అని అన్నారు.