AP: రైతు రుణమాఫీ ప్రభుత్వ వైఫల్యమా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క BRSను ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రజలను రెచ్చగొడుతుందని మండిపడ్డారు. ‘ఫార్మాక్లస్టర్స్ విస్తరణను వ్యతిరేకించటం బుద్ధి తక్కువ పని. మేము కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకం. BRS ప్రతిపక్ష పాత్ర పోషించాలి. సర్కార్ను కూల్చటంపైనే బీఆర్ఎస్ దృష్టి ఉంది. పథకాలను పెంచటానికి కులగణన చేస్తున్నాం. కులగణన దేశానికే రోల్ మోడల్ కాబోతుంది’ అని అన్నారు.