సృజనాత్మక ఆలోచనలను మెరుగుపరుచుకోవడానికి మాతృభాషే కీలకమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాతృభాషను గౌరవించాలని పిలుపునిచ్చారు. ‘భారతీయ నాగరికతలో భాషాపరమైన గర్వం ఉంది. ప్రతి ఒక్కరూ భాషాభిమానాన్ని గౌరవంగా భావించాలి. మాతృభాష లోతైన అభ్యాసానికి ముఖ్యమైనది. మన భాషలు కేవలం కమ్యూనికేషన్ సాధనాలు కావు. అవి మన చరిత్రను, సంప్రదాయాన్ని, తరతరాల సామూహిక జ్ఞానాన్ని కాపాడుతాయి.’ అని చెప్పారు.