TG: పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు గాంధీ భవన్కు వచ్చానని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలు చెప్పుకునేందుకు గాంధీ భవన్కు ప్రజలు వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఘటన వెనక ఉన్న వారెవరో అతిత్వరలో తేల్చుతామని స్పష్టం చేశారు. త్వరలోనే వికారాబాద్ దోషులను మీడియా ముందు పెడుతామన్నారు. ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్న ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారన్నారు.